అగ్నిప్రమాదానికి ఆశ్రయం కోల్పోయిన కృపా బాయికి నిత్యవసర సరుకులు, వంట సామాగ్రి పంపిణీ చేసిన మాజీ మంత్రి బాలరాజు తనయుడు భరత్

చింతపల్లి(షేక్ కాశిమ్ వలీ): మండల కేంద్రం కుమ్మరవీధిలో అగ్నిప్రమాదానికి ఆశ్రమం కోల్పోయిన దాకే కృపాబాయికి మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు తనయుడు భరత్ నిత్యావసర సరుకులు వంట సామాగ్రిని పంపిణీ చేశారు. వివరాల్లోకి వెళితే చింతపల్లి పట్టణ కేంద్రం కుమ్మరి వీధిలో బుధవారం అగ్ని ప్రమాదం సంభవించడం వల్ల కృపా బాయి పూరిళ్ళు పూర్తిగా కాలిపోయింది. దీంతో ఆమె ఆశ్రయం కోల్పోయింది.  నిత్యావసర సరుకులు వంటపాత్రలు కూడా లేని దయనీయ పరిస్థితి కి
చేరుకుంది. అయితే శుక్రవారం మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు ఆమెను పరామర్శించారు. ఆమె ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితిని చూసి ఆయన చలించిపోయారు. ప్రభుత్వం నుంచి సహాయం అందించేందుకు కృషి చేస్తానని ఆమెకు హామీ ఇచ్చిన బాలరాజు  శుక్రవారం తన కుమారుడు భరత్ చేత  ఆమెకు అవసరమైన నిత్యావసర సరుకులు బియ్యం, కూరగాయలు, ఆయిల్ ఇతర సరుకులతో పాటు వంట చేసుకోవడానికి అవసరమైన పాత్రలు కూడా కొనుగోలు చేసి అందజేశారు. అలాగే ఆమెకు చీరను కూడా బహుకరించారు. మంత్రి బాలరాజు అందించిన సహకారానికి ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ఇది ఇలా ఉండగా లాక్ డోన్ పేరిట ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు గృహాల కే పరిమితమైతే మాజీమంత్రి తనదైన శైలిలో లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా ఒక్కరే పర్యటిస్తూ  ప్రజల్లో మనోధైర్యం నింపుతున్నారు. అలాగే పేదలకు తనకు చేతనైన సహాయం చేస్తూ ప్రజల మన్ననలు బాలరాజు అందుకుంటున్నారు. 

Post a Comment

0 Comments