కోరుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మరమ్మతులు..నూతన భవన నిర్మాణానికి పనులు ప్రారంభం

చింతపల్లి:
రెండు రోజుల కిందట గాలివానకు దెబ్బతిన్న కోరుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి బాలాజీ డీకే చొరవతో చింతపల్లి గిరిజన సంక్షేమశాఖ ఇంజినీరింగ్ అధికారులు శరవేగంగా మరమ్మతులు పూర్తి చేశారు. అలాగే నూతన భవన నిర్మాణానికి పనులు కూడా ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే.. చింతపల్లి మండలం శివారు బలపం పంచాయతీ కోరుకొండ గ్రామంలో సుమారు 20 ఏళ్ల కిందట నిర్మించిన  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనంలో ఆరోగ్యశాఖ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల కిందట కురిసిన గాలివానకు భవనం పైకప్పు రేకులు కుప్పకూలిపోయాయి. ఈ ఘటనలో ఒక స్టాఫ్ నర్స్ కూడా గాయపడ్డారు. ఈ మేరకు వెంటనే స్పందించిన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మరమ్మతులకు అవసరమైన 1.80 వేల నిధులను విడుదల చేశారు. ఈ మేరకు చింతపల్లి  గిరిజన సంక్షేమ శాఖ డిఈఈ డివిఆర్ఎం రాజు, ఇంజనీర్ రఘు  ప్రత్యేక శ్రద్ధ తీసుకొని శరవేగంగా మరమ్మతులు పూర్తి చేశారు. ఈ సందర్భంగా డీఈఈ మాట్లాడుతూ కోరుకొండ లో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు(ఎస్ డి పి) 90లక్షలు మంజూరు అయ్యాయని, పనులు కూడా ప్రారంభించామన్నారు. తొమ్మిది నెలల్లో భవన నిర్మాణం పూర్తి అవుతుందని ఆయన తెలిపారు. 

Post a Comment

0 Comments