చింతపల్లి(షేక్ కాశిమ్ వలీ) : గిరిజన సహకార సంస్థ డీఆర్ డిపో ద్వారా గురువారం నుంచి ఉచిత సరుకుల పంపిణీ ప్రారంభించినట్టు పౌరసరఫరాల డిప్యూటీ తహసిల్దార్ యస్ . శ్రీనుబాబు అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ మండలంలో 20994 రేషన్ కార్డులకు గాను 53 డీఆర్ డిపోలు ఉన్నాయన్నారు. వీటిలో రెండు ఈపాస్ డిపోలు కాగా మిగిలినవి ఆఫ్ లైన్ డిపోలన్నారు. ఈపాస్ డిపోల వద్ద అధనంగా ఒక్కొక్క కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సామాజిక దూరం పాటించడంలో సమస్యలు తలెత్తకుండా గా కార్డు దారులకు ఆకుపచ్చ, తెలుపు , ఎరుపు ,నీలం రంగుల కూపన్లను వాలంటీర్ల ద్వారా ముందుగా అందజేయడం జరిగిందన్నారు. ఏ రోజు ఏ రంగు కూపన్ల వారు రావాలన్న విషయం వాలంటీర్లు లబ్ధిదారులకు తెలియజేయడం జరిగింది అన్నారు. వినియోగదారుల సౌకర్యార్థం చేతులు శుభ్రం చేసుకునేందుకు డిపోల వద్ద సబ్బు, శానిటైజర్, నీళ్ళు అందుబాటులో ఉంచనున్నట్లు ఆయన తెలిపారు. ఈ రెండవ దశ ఉచిత రేషన్(బియ్యం, కిలో కొమ్ము శెనగలు) గురువారం నుంచి ఈ నెల 27 వరకు అందజేయనున్నామని ఆయన వివరించారు. ఈ సదవకాశాన్ని తెల్లరేషన్ కార్డుదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
0 Comments