రిలయన్స్‌ జియో రీఛార్జి కోసం సరి కొత్త ‘జియో పీఓఎస్‌ లైట్‌ ’ యాప్

రిలయన్స్‌ జియో రీఛార్జి కోసం సరి కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘జియో పీఓఎస్‌ లైట్‌ ’ పేరిట తెచ్చిన ఈ యాప్ ద్వారా ఇతరులకు రీఛార్జి చేయొచ్చు.  రీఛార్జి చేసిన ప్రతిసారీ కమిషన్‌ పొందొచ్చు. వినియోగదారులు గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్‌ ద్వారా వినియోగదారుడు ఇతర జియో నంబర్లకు రీఛార్జ్‌ చేస్తే ఆ మొత్తంపై 4.16 శాతం కమీషన్‌గా పొందవచ్చు. ఈ యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ లో మాత్రమే అందుబాటులో ఉంది.  కాంటాక్ట్స్‌, ప్రాంతం, మీడియాకు సంబంధించిన యాక్సెస్‌ ఇవ్వడం ద్వారా యాప్‌లో రిజిస్టర్‌ అవ్వాలి. రూ.500, రూ.1000, రూ.2000  వ్యాలెట్‌లోకి మనీ బదిలీ చేసుకోవాలి. అనంతరం అందుబాటులో ఉన్న ప్లాన్లను ఉపయోగించి ఇతరులకు రీఛార్జి చేయొచ్చు.యాప్‌లో పాస్‌బుక్‌ ఫీచర్‌ ద్వారా 20 రోజులకోసారి నగదు లావాదేవీల వివరాలు తెలుసుకోవచ్చు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రీఛార్జి చేయడంలో ఉన్న ఇబ్బందులను తొలగిచండానికి ఈ యాప్‌ ఉపయోగపడుతుంది. 

Post a Comment

0 Comments