సాధువులకు భోజనాలు సమకూర్చిన టీవీ-9 విలేకరి వనరాజు

చింతపల్లి ఏప్రిల్ 6:
పట్టణ కేంద్రంలో ఆకలితో ఇబ్బందులను ఎదుర్కొంటున్న సాధువులకు చింతపల్లి టీవీ-9 రిపోర్టర్ వానరాజు భోజనాలు పెట్టారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలులోకి తీసుకొని వచ్చాయి . దీంతో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న సాధువులు నిరుపేదలు తీవ్ర ఆకలి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చింతపల్లి పట్టణ కేంద్రంలో 20 మంది సాధువులు ఆకలితో ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తించిన టీవీ9 రిపోర్టర్ వారి ఆకలి తీర్చేందుకు తన వంతు సహకారం అందించారు. ఆదివారం రాత్రి సాధువులను తన ఇంటికి తీసుకుని వెళ్ళి భోజనాలు పెట్టారు, దీంతో సాధువులు  సంతోషం వ్యక్తం చేశారు.

Post a Comment

0 Comments