గూడెంకొత్తవీధి ఈ-కోడిసింగిలో వివాహానికి కరోనా వైరస్ ఎఫెక్ట్.. 7న జరగాల్సిన ఇద్దరు అన్నదమ్ముల పెళ్లిని వాయిదా వేసుకున్న గిరిజనులు

గూడెంకొత్తవీధి ఏప్రిల్ 3: 
గూడెంకొత్తవీధి మండలం ఈ-కోడిసింగి గ్రామంలో ఈనెల ఏడో తేదీన జరగాల్సిన ఇద్దరు అన్నదమ్ముల వివాహానికి కరోనా వైరస్  ఎఫెక్ట్ తగ్గింది. ఈనెల ఏడో తేదీన జరుపుకోవాల్సిన వివాహ వేడుకను లాక్ డౌన్ కారణంగా స్థానిక గిరిజనులు వాయిదా వేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..ఈ-కోడిసింగి గ్రామంలో సాగిన లక్ష్మణరావు, లక్ష్మీ దంపతుల ఇద్దరు కుమారుల వివాహం ఈనెల 7వ తేదీన నిర్వహించేందుకు పెద్దలు నిశ్చయించారు. నెల రోజులుగా వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు కుటుంబ సభ్యులందరూ ఏర్పాట్లు చేసుకున్నారు. ఆహ్వాన పత్రికలు కూడా ప్రింటింగ్ చేయించుకొని పంపిణీ కూడా చేసేసారు. అయితే కరోనా వైరస్  వ్యాప్తి నివారణలో భాగంగా ఈనెల 14 వరకు లాక్ డౌన్  కొనసాగిస్తున్నడం, మరోవైపు విందు, వినోద కార్యక్రమాలను జరుపుకో రాదని ప్రభుత్వం హెచ్చరిస్తున్న నేపథ్యంలో  వివాహాన్ని వాయిదా వేసుకోవాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. కాగా ఈ-కోడిసింగి సాగిన వారి వివాహం రద్దు చేస్తున్నట్లు కుటుంబ సభ్యుడు, ఉపాధ్యాయుడు రామారావు తెలిపారు.  

Post a Comment

0 Comments