7 గంటల్లో భారీగా పెరిగిన కరోనా వైరస్ కేసులు...భారతదేశంలో బలపడుతున్న కరోనా వైరస్


ఢిల్లీ ఏప్రిల్ 2, (ఉదయం గంటలు):  
దేశవ్యాప్తంగా 7 గంటల్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. తొలి రోజుల్లో అనేక సంఖ్యలో నమోదయ్యే కరోనా వైరస్ కేసులు, మూడు రోజులుగా పదుల సంఖ్యలో నమోదవుతున్నాయి. గురువారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా 2014 కేసులు నమోదయ్యాయి .ఇందులో 1789 కేసుల్లో కరోనా వైరస్ బలంగా పనిచేస్తుంది.169 అందులో కరోనా వైరస్ బలహీనంగా ఉంది. నేటి వరకు 56 మంది కరోనా వైరస్ కారణంగా మరణించారు. గరిష్టంగా మహారాష్ట్రలో 335 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా 14మంది మరణించారు. కనిష్టంగా గుజరాత్లో 86 కేసు నమోదు కాగా ఆరుగురు మరణించారు..
తెలంగాణ ను మించిపోయిన ఏపీ ..
కరోనా వైరస్ కేసు నమోదు విషయంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాన్ని మించిపోయింది.నేటికి తెలంగాణలో 97 కేసులు నమోదు కాగా ఏపీలో 111 కేసులు నమోదయ్యాయి.  అయితే తెలంగాణలో ఏడుగురు మరణించగా ఏపీలో ఇంతవరకు మరణాలు లేవు..

Post a Comment

0 Comments