తాజంగి డి ఆర్ డిపోలో సరుకుల కోసం తోసుకుంటున్న లబ్ధిదారులు.. ఉచిత సరుకులకు ఆఖరి రోజని ఒకేసారి తరలివచ్చిన 7 గ్రామాల గిరిజనులు..భౌతిక దూరం పాటించని వినియోగదారులు..జాడలేని నియంత్రణ సిబ్బంది..

సరుకుల కోసం ఒకరినొకరు తోసుకుంటున్న వినియోగదారులు 
చింతపల్లి: మండలంలోని తాజంగి గిరిజన సహకార సంస్థ డిఆర్ డిపో కి ఉచిత సరుకుల పంపిణీ ఆఖరి రోజు అని భావించిన ఏడు గ్రామాల గిరిజనులు ఒకేసారి సరుకుల కోసం తరలి వచ్చారు. దీంతో సరుకుల కోసం వినియోగదారులు ఒకరినొకరు తోసుకోవాల్సిన  పరిస్థితి ఏర్పడింది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని, ఆరు అడుగుల భౌతిక దూరం పాటిస్తూ సరుకులు తీసుకునేలా జీసీసి అధికారులు ఏర్పాట్లు చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బాలాజీ, చింతపల్లి ఏ ఎస్ పి సతీష్ కుమార్, మండల త్రీ  మన్ కమిటీ  అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే అధికారులు గిరిజన ప్రాంతంలో కారోన వైరస్ వ్యాప్తిని నివారించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. 
తాజంగి రేషన్ దుకాణం వద్ద వినియోగదారులు భౌతిక దూరం పాటించాలి అని చెప్పేవారు గాని, నియంత్రణ ఏర్పాట్లు చేసే సిబ్బంది గాని డి ఆర్ డిపో వద్ద కనిపించక పోవడం వల్ల వినియోగదారులు సరుకుల కోసం తోసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రాంతీయ విజ్ఞప్తి చేస్తున్నారు.  

Post a Comment

0 Comments