ఏపీలో 534 కి చేరిన కరోనా వైరస్ కేసులు

అమరావతి:
ఏపీలో మరో తొమ్మిది మందికి కరోనా వైరస్ సోకింది. నిన్న సాయంత్రం 7 గంటల నుంచి ఈ రోజు ఉదయం 9 గంటల వరకు నిర్వహించిన కోవిడ్ 19 పరీక్షల్లో కృష్ణా జిల్లాలో 3, పశ్చిమ గోదావరి జిల్లాలలో 3, కర్నూలులో 3 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 534కు చేరింది. అందులో 20 మంది డిశ్చార్జి కాగా, 14 మంది మరణించారు. ప్రస్తుతం 500 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లాల వారీగా చూస్తే.. అనంతపూర్‌లో 21, చిత్తూరులో 23, తూర్పు గోదావరిలో 17, గుంటూరులో 122, కడపలో 36, కృష్ణాలో 48, కర్నూలులో 113, నెల్లూరులో 58, ప్రకాశంలో 41, విశాఖపట్నంలో 10, పశ్చిమ గోదావరిలో 34 కేసులు నమోదు కాగా.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

Post a Comment

0 Comments