ఏపీలో 525కి పెరిగిన కరోనా పాజిటివ్‌ కేసులు

అమరావతి: ఏపీలో 525కి కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగాయి. ఏపీలో ఇవాళ 23 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైయ్యాయి. కర్నూలు 13, గుంటూరు 4, కడపలో 3, నెల్లూరు 2, అనంతపురంలో ఒక కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్నట్లు నిర్ధారించారు. ఏపీలో మొత్తం కరోనాతో ఇప్పటివరకు 14మంది మృతి చెందగా.. ప్రస్తుతం 491మంది కరోనా పాజిటివ్‌లకు చికిత్స అందిస్తున్నారు. ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసులు జిల్లాలవారీగా  చూస్తే..అనంతపురం 21, చిత్తూరు 23, తూ.గో, 17, గుంటూరు 112, కడప 36, కృష్ణా 45, కర్నూలు 110, నెల్లూరు 58, ప్రకాశం 42, విశాఖ 20, పశ్చిమగోదావరి జిల్లాలో 31 పాజిటివ్‌ కేసులు నమోదైయ్యాయి.

Post a Comment

0 Comments