ఢిల్లీ: పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల విజ్ఞప్తి మేరకు ప్రజలందరూ ఊహించిన మేరకే దేశ ప్రధాని నరేంద్ర మోడీ లాక్ డౌన్ మే 3 వరకు పొడిగిస్తున్నట్టు ప్రసంగంలో ప్రకటించారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో మెజార్టీ రాష్ట్రాల సీఎంలు లాక్ డౌన్ పొడిగించాలని ప్రధాని మోదీతో ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పారు. దీంతో రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని లాక్ డౌన్ ను మోదీ పొడిగించారు. కాగా ఇప్పటికే పలు రాష్ట్రాలు లా డౌన్ పొడిగించాయి. ప్రస్తుతం కొనసాగుతున్న నిబంధనలు యధా విధంగా కొనసాగించనున్నట్లు మోడీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న నిబంధనలు యధా విధంగా కొనసాగించనున్నట్లు మోడీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
0 Comments