చింతపల్లి, ఏప్రిల్ 2:
లాక్ డౌన్ సమయంలో పాత్రికేయుల సేవలను గుర్తించిన పాడేరు ఎమ్మెల్యే Kottagulli భాగ్యలక్ష్మి నిత్యావసర సరుకులు కొనుగోలు కోసం చింతపల్లి ప్రెస్ క్లబ్ కి రూ .28 వేల నగదును అందజేశారు. అలాగే చింతపల్లి వైసీపీ జడ్పిటిసి అభ్యర్థి పోతురాజు బాలయ్య, బియ్యం ఇతర సరుకులను అందజేశారు. వివరాల్లోకి వెళితే ..కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన విషయం పాఠకులకు తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో న్యూస్ కవరేజ్ కోసం సేవలందిస్తున్న పాత్రికేయులకు సహాయ పడాలని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఆమె భర్త డాక్టర్ నరసింగరావు గురువారం చింతపల్లి వచ్చి నగదు సహకారం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ..పాత్రికేయుల సేవలు అభినందనీయమని , పాత్రికేయులకు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని అన్నారు . ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రత్యేక కృషి చేస్తున్నారన్నారు. పాత్రికేయులు కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం ప్రజలకు అవగాహన కల్పించే విధంగా వార్తా కథనాలు ప్రచురించాలని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ సలహాలు, సూచనలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలి అన్నారు. అలాగే చింతపల్లి వైసీపీ జడ్పిటిసి అభ్యర్థి, మాజీ ఉపాధ్యాయుడు పోతురాజు బాలయ్య ఒక్కొక్క విలేఖరికి 10 కేజీల ఫైండ్ రైస్, కేజీ పప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు పంపిణీ చేశారు. విలేకరులకు సహకారం అందించిన పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కి , జడ్పిటిసి అభ్యర్థి పోతురాజు బాలయ్యకి, వైసిపి నాయక బృందానికి చింతపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వనరాజు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ నరసింగరావు, అరుకు పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్, జడ్పిటిసి అభ్యర్థి పోతురాజు బాలయ్య, ఎంపీడీవో ప్రేమకర రావు తదితర నాయకులు పాల్గొన్నారు.
0 Comments