న్యూఢిల్లీ April 2(Night): ఇండియాలో కరోనా వైరస్ నిర్ధారిత కేసుల సంఖ్య 2,069కి పెరిగింది. సాయంత్రం ఆరు గంటలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఇందులో 1860 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 156 మంది ఇప్పటి వరకు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 53 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఈ రోజు (గురువారం) ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 335 కేసులు నమోదు కాగా, 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కేసులు గణనీయంగా పెరుగుతుండడంతో రాష్ట్రంలోని 30 ప్రభుత్వ ఆసుపత్రులను కోవిడ్-19 ఆసుపత్రులుగా మార్చి 2305 బెడ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మహారాష్ట్ర తర్వాత కేరళలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఇక్కడ 265 కేసులు నమోదు కాగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో 234 కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందారు. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 219కి పెరిగింది.
0 Comments