ఏపీలో 192కి చేరిన కేసులు...తెలంగాణలో 272 పాజిటివ్‌ కేసులు..


అమరావతి April 4:(11pm) ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 192కి చేరింది. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మొత్తం 12 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఈ మేరకు బులెటిన్‌ విడుదల చేసింది. జిల్లాల వారీగా కేసుల వివరాలు కింది పట్టికలో..
తెలంగాణలో 272కి చేరిన కరోనా కేసులు
హైదరాబాద్‌ April 4:(11pm) ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తున్న మహమ్మారి కరోనా తెలంగాణలో అర్రులు చాస్తోంది. ఇవాళ మరో 43 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 272కి చేరింది. కరోనా నయమైన ఒకరిని ఇవాళ డిశ్చార్జి చేశామని, దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 33కి చేరిందని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 228 చికిత్స పొందుతుండగా.. 11 మంది మృతి చెందినట్లు ఆయన పేర్కొన్నారు.

Post a Comment

0 Comments