ఏపీలో మరో పాజిటివ్‌ కేసు..162కి చేరిన కేసులు


అమరావతి, ఏప్రిల్ 3(10:33pm) : ఆంధ్ర ప్రదేశ్ మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. తాజాగా విశాఖలో ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు నిర్దారణ అయిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 162కి చేరింది. ఈ మధ్య ఏపీలో కేసులు వరుసగా పెరుగుతూ వచ్చినప్పటికీ ఈరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య మాత్రం ఒక్క కేసే నమోదైంది. మరోవైపు కరోనా నుంచి కోలుకున్న మరో ఇద్దర్ని ఈరోజు డిశ్చార్జ్‌ చేశారు. 

Post a Comment

0 Comments