అమరావతి April 3: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య 161కి చేరిందని వైద్య ఆఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో ప్రకటించింది. గురువారం రాత్రి 10 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9గంటల వరకు కొత్తగా 12 కేసులు నమోదయ్యాయని తెలిపింది. కొత్తగా నమోదైన కేసుల్లో నెల్లూరు 8, విశాఖలో 3 ఉన్నాయి.
తూర్పుగోదావరి జిల్లాలో తొలి పాజిటివ్ కేసు నమోదైన వ్యక్తి ఆసుపత్రినుంచి డిశ్చార్జి అయ్యాడు. లండన్ నుంచి వచ్చిన రాజమహేంద్రవరానికి చెందిన విద్యార్థి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్నట్టు వైద్యులు తెలిపారు. విద్యార్థి కుటుంబ సభ్యులు, స్నేహితుల నమూనాలు అన్నింటిలోనూ నెగిటివ్ ఫలితాలువచ్చాయని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఎస్పీ నయీం హస్మీ, జీజీహెచ్ సూపరింటెండెంట్ రాఘవేంద్రరావు మీడియాకు వివరాలు వెల్లడించారు.
0 Comments