పట్టణంలో సెక్షన్ 144 సిఆర్ పి అమల్లో ఉందని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని నర్సీపట్నం టౌన్ ఎస్ఐ రమేష్ అన్నారు. ఆదివారం మూడు రోడ్ల జంక్షన్ లో నిబంధనలకు విరుద్ధంగా వాహనాల్లో సంచరిస్తున్న వ్యక్తులకు ఎస్ఐ పలు సూచనలు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలుపర్చాయన్నారు. నర్సీపట్నంలో రెండు కరోనా వైరస్ పాజిటివ్ లు నమోదు కావడంతో ఒక ప్రాంతాన్ని కంటెయిన్మెంట్ జోన్ గా ప్రకటించడం జరిగిందన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం ప్రస్తుతం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించిన సమయం ఇది అని ఆయన స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో మినహా ఏ ఒక్కరూ బయటకు రాకూడదని, నిబంధనలు అతిక్రమించి సంచరించే వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. పోలీసులు, ఉన్నతాధికారులు లాక్ డౌన్ సమర్థవంతంగా అమలు పరిచేందుకు నిరంతరం సేవలందిస్తున్నారన్నారు. లాక్ డౌన్ ముగిసేవరకు ప్రజలు అందరూ సహకరించాలని, ఏ ఒక్కరు రహదారులపై సంచరించే రాదని ఆయన సూచించారు.
0 Comments