అల్లూరి జిల్లా ఖాజీగా హాసరత్ ఖాన్

అరుకు ఆగస్టు 30 (పడాల శ్రీనివాసరావు -ఎడిటర్ )అల్లూరి సీతారామరాజు జిల్లా నూతన కాజీ గా హసరత్ ఖాన్ గా అధిష్టాన నాయకులు నియమించడంతో బుధవారం ఆయన స్థానిక ఎమ్మెల్యే.
చెట్టి ఫాల్గుణ సమక్షంలో పదవి బాధ్యతలను స్వీకరించారు ఈ సందర్భంగా జమత్ కమిటీ మాట్లాడుతూ అరకు నియోజకవర్గం అరకువేలి మండల వాసులకు ఖాజి బాధ్యతలు రావడం ఆనందంగా ఉందని ఇందుకు కృషి చేసిన అరకు ఎమ్మెల్యే కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు వైసిపి పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని స్థానిక ఎమ్మెల్యే నేతృత్వంలో అరకు నియోజకవర్గం అభివృద్ధి దిశగా పయనిస్తుందని రాబోయే ఎన్నికల్లో వైసిపి గెలుపుకు ముస్లిం సోదరులందరూ కృషి చేస్తామని తెలిపారు.
నూతన పదవి బాధ్యతలు స్వీకరించిన హసరత్ ఖాన్ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని ముస్లిం సోదరుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని ఖాజీ పదవి బాధ్యత రావడానికి ప్రత్యేక కృషి చేసిన అరకు ఎమ్మెల్యే కి తమందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్నారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ మాట్లాడుతూ గతంలో లేనటువంటి సంక్షేమం వైసీపీ ప్రభుత్వంలో ఉందని అలాగే ముస్లిం సోదరుల సంక్షేమం కొరకు తమ ప్రభుత్వం పెద్దపీట వేసిందని డిప్యూటీ సీఎం పదవిని సైతం ఇవ్వడం జరిగిందని నూతనంగా నియమితులైన ఖాజీ కి శుభాకాంక్షలు తెలుపుతూ ఎల్లప్పుడూ తమకి అందుబాటులో ఉంటూ ఎల్లవేళల సేవ చేస్తూ ఉంటానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో జమాత్ మసీదు కమిటీ అధ్యక్షులు
గులం హైదర్ అలీ ఖాన్, అరకువేలి మండల కో ఆప్షన్ సభ్యుడు., షేక్ రహంతుల్లా
కమిటీ ఉపాధ్యక్షులు వైసిపి నాయకులు, ఎస్ కే యాసీన్, ఎస్.కె రహీం, ఎస్ కే ఖాన్ఎ, స్ కె అమీద్ఎ, స్.కె భాషా, ఎస్ కె అజారుద్దీన్ఎస్.కె రహమాన్, ఎస్ డి ముహిదిన్ఎస్ కే ఆదిల్ పాల్గొన్నారు. 

Post a Comment

0 Comments